తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో 500 కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన LPG వినియోగదారులకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది.
సబ్సిడీ: మొదట సిలిండర్ మొత్తాన్ని చెల్లించాలి. అనంతరం 500 రూపాయలకు పైగా చెల్లించిన మొత్తాన్ని సబ్సిడీగా తిరిగి పొందవచ్చు.మీరు సబ్సిడీ లభించిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. దానికి సంబంధించిన సులభమైన దశలు ఇవి:-
ముందుగా www.mylpg.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. లాగిన్ ఆప్షన్ దగ్గర మీ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.వెబ్ పేజీ పై భాగంలో గ్యాస్ ఫోటోలు చూపించబడతాయి. మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందినదో ఆ కంపెనీని ఎంచుకోవాలి (భారత్ గ్యాస్, HP గ్యాస్, ఇండియన్ గ్యాస్).వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ సిలిండర్‌కి సబ్సిడీ ఉందా లేదా అనేది అక్కడ కనిపిస్తుంది.
సమస్యలు ఉంటే:..మీ పేరు జాబితాలో లేనట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1800233355 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.