Tuesday, September 22, 2026
Homenewsచంద్రబాబు శిష్యుడిని ఎందుకు పిలవలేదు?

చంద్రబాబు శిష్యుడిని ఎందుకు పిలవలేదు?

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఎంద‌రో ప్రముఖులను ఆహ్వానించారు. అందులో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, రేవంత్‌ను పిలవలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూట‌మి గెలిచినప్పుడు రేవంత్, చంద్ర‌బాబుకు ఫోన్ చేసి అభినందించారు. కానీ, ప్ర‌మాణ స్వీకారానికి రాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు బ‌ద్ధ శ‌త్రువైన బీజేపీతో పొత్తు ఉండటంతో రేవంత్‌కు ఆహ్వానం రాలేదన్న వార్త వినిపిస్తోంది. రేవంత్ ఒక ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు గురించి, “శిష్యుడా, తొక్కా అదేమీ లేదు. ఆయ‌నతో క‌లిసి ప‌నిచేసాను” అన్నారు. ఇది కూడా రేవంత్‌ను పిలవకపోవడానికి ఒక కారణం కావచ్చు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS