వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన ప్యాలెస్ కోసం రహదారిని ఐదేళ్ల పాటు దిగ్భందించి వాడుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆంక్షలను తొలగించింది. తాడేపల్లి నుంచి మంగళరి వరకు 4 లేన్ల రహదారి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రహదారి తిరిగి తెరుచుకోవడంతో అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

