ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం తాగి 38 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. “తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మద్యం బ్రాండ్‌లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే, తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ నాటు సారా తాగి 38 మంది మరణించారు. మొత్తం 92 మంది కల్తీ సారా తాగినట్లు గుర్తించారు. మిగిలిన వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

