యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ‘దేవర’ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలు టచ్ అవుతుందని సమాచారం. అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి.
సినిమా ఈవెంట్‌లో డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ, “మూవీ సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. గుర్తింపునకు నోచుకోని కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ మనుషుల కంటే భయం భక్తి లేని మృగాలు వంటి వారు ఉంటారు. వాళ్ళని భయపెట్టేది ఒక్కడే, అదే దేవర” అని హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బ్యాక్‌డ్రాప్ స్టోరీ మొత్తం లీక్ అయిపోయింది.
సముద్ర తీరంలో అంతగా గుర్తింపు లేని పది గ్రామాల్లో ‘దేవర’ రాక్షసుడిగా కనిపిస్తాడు. ఆ పది గ్రాముల వద్ద విలువైన నిధి ఉంటుంది. దాని కోసం మాస్కులు ధరించి దొంగలు దాడి చేస్తారు. ఆ దొంగల ముఠా పదివేల మంది ఉంటారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉంటాయి. దేవర మాత్రమే ఆ గ్రామాలకు అండగా ఉంటాడు. దేవర దొంగల్ని గ్రామాలను రక్షించడానికి సముద్రపు తీరంలో కలవరం సృష్టిస్తాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు, గ్రామాలను నిధులను దోచుకోవడానికి వేసే ఎత్తుగడలు కూడా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.