Sunday, July 13, 2025
Homenewsఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు: కోమటిరెడ్డి vs కేసీఆర్, హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు: కోమటిరెడ్డి vs కేసీఆర్, హరీశ్ రావు

తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తథ్యమని అన్నారు. ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి నేతృత్వంలో పనిచేసేలా రాధాకృష్ణ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నతో రౌడీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్‌లో పాల్గొన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు వసూలు చేశారని, కేసీఆర్ ఎంత పెద్ద తప్పు చేశారో ప్రశ్నించారు. కేసీఆర్ ప్రస్తుతం అన్ని పద్ధతుల్లో ఇరుక్కున్నారని, ఫోన్ ట్యాపింగ్ రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తే తాము దొరికిపోతామని గ్రహించిన కేసీఆర్, హరీశ్ రావును అమెరికా పంపారని ఆరోపించారు. మే 26న వేకువ జామున 4.35 గంటలకు ఎమిరేట్స్ విమానం ద్వారా హరీశ్ అమెరికా వెళ్లారని, తిరిగి ముంబయి మీదుగా హైదరాబాద్ కు వచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. హరీశ్ రావు అమెరికా వెళ్లిన వివరాలు ఎయిర్ పోర్టులో లభ్యం అవుతాయని, అక్కడ ప్రభాకర్ రావును కలిసినట్లు పేర్కొన్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS