తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న బీఈడీతో నియామకమైన ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులకు ముఖ్య సమాచారం. బదిలీలు, ప్రమోషన్ షెడ్యూల్ Lr.R.C.NO. 565 ప్రకారం, బీఈడీతో ఎస్జీటీగా నియామకమైన వారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, పిఎస్ హెచ్ఎం పోస్టులకు అర్హులుగా పరిగణిస్తున్నారు. ఇంటర్మీడియట్, డీఈడీ ఉన్నా సరే, వారిని కూడా సీనియారిటీ లిస్ట్‌లో చేర్చాలని ఉత్తర్వులు ఇచ్చారు. డిగ్రీ, బీఈడీ ఉన్నవారు పిఎస్ హెచ్ఎం ప్రమోషన్ పోస్టులకు అర్హులు. గత ప్రభుత్వ సమయంలో బీఈడీతో ఉన్నవారికి ప్రమోషన్లు ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి, బీఈడీతో నియామకమైన ఎస్జీటీలు ప్రమోషన్లు పొందడానికి అర్హులు.

