Monday, November 10, 2025
Homenewsసినిమా దోపిడీకి తీసిపోని రియల్ లూటీ – కాలిఫోర్నియాలో ఏం జరిగింది?

సినిమా దోపిడీకి తీసిపోని రియల్ లూటీ – కాలిఫోర్నియాలో ఏం జరిగింది?

అమెరికాలో దొంగలు బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా వ‌స్తువుల్ని ద‌ర్జాగా దోచుకుంటున్నారు. తాజాగా, కాలిఫోర్నియాలో ఓ భారతీయ వ్యాపారికి చెందిన‌ నగల దుకాణంలో జరిగిన భారీ దోపిడీ ఉదంతం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగింది.

 

——–సంఘటన వివరాలు——-

ఈ నెల 12న అర్ధరాత్రి సుమారు 20 మంది ముసుగు దొంగలు కేవలం మూడే మూడు నిమిషాల్లో దుకాణాన్ని దోచుకున్నారు. ఈ దోపిడీ మధ్య సెక్యూరిటీ గార్డు భయపడి, ఏమీ చేయలేకపోయాడు. దుండగులు మొదటగా అద్దాల ద్వారం పగులగొట్టి షోరూం లోకి ప్రవేశించారు..

——–దోపిడీ విధానం———–

వారెవ్వా! దొంగలు షోరూం లోకి ప్రవేశించిన వెంటనే, అందినకాడికి ఆభ‌ర‌ణాల‌ను బ్యాగుల్లో వేస్తూ డెస్కుల అద్దాలను పగులగొట్టారు. షోరూం అంతా అల్లకల్లోలంగా మార్చారు. కేవలం మూడే మూడు నిమిషాల్లో షోరూం లో ఉన్న విలువైన ఆభరణాలను దోచుకొని పరారయ్యారు.

ఈ ఘ‌ట‌న తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా దుండగుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఈ దోపిడీపై దర్యాప్తు జరిపి మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.

 

ఈ దోపిడీ జరిగిన దుకాణం పూణె కేంద్రంగా ఉన్న పీఎన్‌జీ జ్యువెల్లర్స్‌కి చెందింది. పీఎన్‌జీ జ్యువెల్లర్స్‌కు యూఎస్, దుబాయిలలో కలిపి 35 శాఖలు ఉన్నాయి. ఈ సంస్థ‌ను పురుషోత్తం నారాయ‌ణ్ గాడ్గిల్ స్థాపించారు. ఒకే ఒక స్టోర్ నుండి ప్రారంభమైన ఈ కంపెనీ, ఇవాళ గ్లోబ‌ల్ చైన్‌గా ఎదిగినది ఒక విశేషం.. అమెరికాలో దోపిడీ ఘటనలు పెరుగుతుండటం, భద్రతాపరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ దోపిడీ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి దోషులను పట్టుకోవడంలో విజయం సాధిస్తారని ఆశిద్దాం.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS