తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, గత సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లే సీఐడి చీఫ్ సంజయ్ నడుచుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే, సీఎస్ జవహర్ రెడ్డి.. సంజయ్‌ను సెలవులపై పంపించారు. దాంతో సంజయ్ నిన్న రాత్రి అమెరికాకు వెళ్లిపోయారు. ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలిసి, జవహర్ రెడ్డిపై మండిపడ్డారు. జవహర్ రెడ్డితో చంద్రబాబు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్‌ను ఎందుకు సెలవుపై పంపించారని నిలదీశారు. ఇకపై అన్నింటిపై తన ఫోకస్ ఉంటుందని, సొంత నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.