తెలుగు దేశం పార్టీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కేవలం ఐదు రోజుల్లో రూ.579 కోట్లు సంపాదించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్స్ ఈ వారం రోజుల్లో విపరీతంగా లాభాలను చూశాయి. ఈ స్టాక్‌లో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. మే నెలలో హెరిటేజ్ ఫుడ్స్‌కి చెందిన ఒక్కో షేర్ ధర రూ.402.90గా ఉండగా, చంద్రబాబు నాయుడు గెలవడంతో ఆ ధర రూ.659కి పెరిగింది. నారా భువనేశ్వరి 2,26,11,525 షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఈ లాభాలు పొందారు.