చిత్తూరు జిల్లాలో 33 మంది వాలంటీర్లపై అధికారులు వేటు(Volunteers Dismissed) వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు.
ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వాలంటీర్లను తొలగించినట్టు(Volunteers Dismissed) అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్ల పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
READ LATEST TELUGU NEWS: ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిందే!