Thursday, March 12, 2026
Homenewsటీమ్ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన శిందే

టీమ్ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన శిందే

టీ20 ప్రపంచకప్‌ 2024లో విజయం సాధించిన టీమ్‌ ఇండియాను సన్మానిస్తూ, బీసీసీఐ వారు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కూడా టీమ్‌ ఇండియాకు రూ.11 కోట్ల రివార్డును ప్రకటించారు. ముంబయికి చెందిన వరల్డ్ కప్‌ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌ను తన అధికారిక నివాసం వర్షలో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. వీరితో కలిసి కాసేపు మాట్లాడి, ప్రపంచకప్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే టీమ్‌ ఇండియాకు నగదు బహుమతి ప్రకటించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS