మారథాన్ రన్నర్ (Marathon Runner Swamy) బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలీకామ్ ఆఫీసర్ చినపాక స్వామి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్ అచీవర్-2024 అందుకున్నారు. ప్రతిరోజు ఐదు(5)కిలోమీటర్ల పరుగు 1,000 రోజులు ఇటీవలే పూర్తి చేసుకొని ఇప్పటివరకు 6,332 కి.మీలు పరుగుల ప్రయాణాన్ని చేరుకున్నారు.
ఈ ప్రయాణానికిగానూ స్వామి అవార్డు అందుకున్నారు. అయన కుటుంబ సభ్యులు, తన గ్రామస్తులకు, ఫిట్ ఇండియా ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్) వారియర్స్, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, స్నేహితుల మద్దతుతో ఈ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. (Marathon Runner Swamy) ఇండియా బుక్‌లో చోటు దక్కిన సందర్భంగా ప్రతి ఒక్కరికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
మద్యం, మత్తుకు దూరంగా..
అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగ, వాకింగ్(నడక), రన్నింగ్(పరుగు) ప్రతిరోజు చేయాలని స్వామి సూచించారు. తద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని పేర్కొన్నారు. మద్యం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు.
దాంతో సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా జీవించాలని కోరారు. యువత, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ అబదరికీ స్ఫూర్తిదాయకంగా ఆయన ఒక ఫిట్నెస్ ఉద్యమాన్నే నడిపిస్తున్నారు.
స్వామి గతంలో ముంబయి, గోవా, వైజాగ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్(42.195మీ).. 5, 10 కి.మీ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ ఏడాది జనవరి 28న ఐదు కిలోమీటర్ల పరుగు 1000వ రోజు పూర్తి చేసుకున్నారు.
ఆ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అభినందన 5Km రన్(ఐదు కిలోమీటర్ల పరుగు) ప్రత్యేక కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ నుంచి స్వామి అభినందనలు అందుకున్నారు.

తల్లి అండతో చదివి..
చినపాక స్వామిది నల్గొండ జిల్లా నల్గొండ గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్న తనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి రోజువారీ కూలీ చేసి కష్టపడి చదివించింది. భువనగిరి గురుకుల పాఠశాలలో చదివి, తర్వాత బీటెక్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేశారు.
తర్వాత బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం చేస్తూ ఫిటినెస్‌లో ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ‘ఫిట్ ఇండియా ఫౌండేషన్’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామి కొనసాగుతున్నారు.
వివిధ గ్రామాల్లో ఫిట్‌నెస్, యోగా, వాకింగ్, రన్నింగ్ ఉపయోగాలు, దానిపట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మద్యం, మత్తు, పదార్థాలు డ్రగ్స్, ఇతర వ్యసనాలతో జీవితంలో తలెత్తే అనారోగ్య సమస్యలు, ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నారు.
1000 రోజులు నిర్వీరామంగా ప్రతి రోజూ 5కిమీ నుంచి 60కి.మీ రన్ చేశారు. 1000 రోజులలో.. 8 మారథాన్స్(42.2కి.మీ), రెండు అల్ట్రా మారథాన్స్(60కి.మీ), 62 హాఫ్ మారథాన్స్(21.1కి.మీ), 10 కి.మీలు 120, మొత్తం 6,332కి.మీలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండియా బుక్ రికార్డ్స్ గుర్తించి అవార్డుతో గౌరవించింది.
READ LATEST TULUGU NEWS : తెలంగాణ యువతలో 30 ఏళ్లకే బీపీ, షుగర్