కొన్నాళ్ల క్రితం విజయవాడలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్(Chaddi Gang) ఆ తర్వాత మాయమైంది. గతేడాది ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు కనిపించాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చొరబడి లక్షల రూపాయల నగదు దోచుకుంది.
స్కూల్‌లోని సీసీటీవీలో చెడ్డీ గ్యాంగ్(Chaddi Gang) దోచుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. శనివారం రాత్రి వరల్డ్ వన్ స్కూల్‌లోకి ముసుగులు, చెడ్డీలతో చొరబడిన ఇద్దరు దొంగలు టేబుల్ సొరుగులో ఉన్న రూ. 7.85 లక్షలు దోచుకెళ్లారు.
స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెడ్డీగ్యాంగ్ ముఠా(Chaddi Gang) హైదరాబాద్‌లో దిగిందన్న వార్తతో మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
READ LATEST TELUGU NEWS : ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిందే!