హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు (Burgula Ramakrishna Rao) 125వ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. లిబర్టీలోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు సాయి రామకృష్ణ, లక్ష్మీనారాయణ, లక్ష్మీకాంత్, కమల, వెంకటేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1899లో జన్మించిన బూర్గుల రామకృష్ణారావు(Burgula Ramakrishna Rao) .. 1967 సెప్టెంబర్ 14న కన్నుమూశారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి మొదటిసారి ఎన్నికలు జరిగిపుడు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బూర్గుల ఎన్నికయ్యారు. అనంతరం ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
READ LATEST TELUGU NEWS: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ శైనీ