Harish Rao Fires On Kadiyam: కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా కనబడుతోందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి(Kadiyam Srhari)కి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలి.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish. pic.twitter.com/mPjbIsjV5q
— BRS Party (@BRSparty) April 1, 2024
Read Also: కాంగ్రెస్ గూటికి మేయర్ గద్వాల విజయలక్ష్మి
కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య(Kadiyam Kavya)కు ఎంపీ టికెట్ తీసుకుని, అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సహేతుకం కాదని హరీశ్ రావు(Harish Rao Fires On Kadiyam) మండిపడ్డారు.
సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు.
కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
READ LATEST TELUGU NEWS: కూతురు కావ్యతో కాంగ్రెస్‌లో చేరిన కడియం