Tuesday, April 22, 2025
HomeKadiyam Srihari joins congress: కూతురు కావ్యతో కాంగ్రెస్‌లో చేరిన కడియం

Kadiyam Srihari joins congress: కూతురు కావ్యతో కాంగ్రెస్‌లో చేరిన కడియం

Kadiyam Srihari joins congress:బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు.

జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి కడియం ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానించారు.

శనివారం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కేశవరావు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Read Also: కాంగ్రెస్ గూటికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి?

వరంగల్ ఎంపీగా కడియం ఫ్యామిలీ నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కడియం శ్రీహరి(Kadiyam Srihari joins congress)కి లేదా ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టీకెట్ ఇచ్చినా కూడా పోటీ నుంచి తప్పుకున్నారు కడియం కావ్య(Kadiyam Kavya). పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల పోటీచేయలేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు ఆమె లేఖ రాశారు.

READ LATEST TELUGU NEWS: ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ఆవిష్కరించిన షర్మిల

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS