Tuesday, April 22, 2025
HomePM Modi Fires On Rahul Gandhi: రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం

PM Modi Fires On Rahul Gandhi: రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం

PM Modi Fires On Rahul Gandhi: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ మండుతుందని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

60 ఏళ్లు పాలించారు.. కానీ 10 ఏళ్లు అధికారంలో లేకుంటే దేశాన్ని తగబెట్టేలా మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు.

ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌లో జరిగిన బీజేపీ(BJP Rally) ర్యాలీలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్య భాషా? అని ప్రశ్నించారు.

Read Also: వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ

Image

ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌తో కాంగ్రెస్‌కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు. అందుకే వారు ఆదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో బిజీగా ఉన్నారని అన్నారని మోడీ ఆరోపించారు.

జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) రెండు క్యాంపుల మధ్య పోటీ ఉండబోతోందని ప్రధాని వివరించారు. ఓ వైపు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత తీసుకొస్తున్నామని, మరోవైపు అవినీతిపరులు, దొరల ముఠా ఉందని మోడీ అన్నారు.

ఈ అవినీతిపరులు మోడీని తిట్టి, బెదిరిస్తున్నారన్నారు. బీజేపీ అవినీతిని తొలగించాలని చెబితే, వారు అవినీతిపరులను రక్షించాలని చూస్తున్నారని ఇండియా కూటమిపై ప్రధాని మోడీ(PM Modi Fires On Rahul Gandhi)  ఆరోపణలు చేశారు.

తాను బెదిరింపులకు భయపడనని, అవినీతిపరులపై చర్యలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు.

READ LATEST TELUGU NEWSరామ్‌దేవ్ బాబాపై సుప్రీం కోర్టు సీరియస్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS