తెలంగాణ సర్కార్ మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని.. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు(Houses For Journalist) ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ అంశంపై పూర్తి సమీక్ష జరిపి.. ప్రణాళికను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
గురువారం రోజు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తమ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాలు(Houses For Journalist) కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు జర్నలిస్టులకు న్యాయం జరగలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. కానీ.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు గానీ, ఇళ్లు ఇవ్వడానికి సానుకూలంగా ఉందని చెప్పారు.
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలను ఏకతాటిపై తీసుకువచ్చి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
READ LATEST TELUGU NEWS: రైతులకు నష్టం పరిహారం అందిస్తాం: మంత్రి జూపల్లి