MLC Kavitha Bail Petition: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.
కవిత తరఫున న్యాయవాదులు సింఘ్వీ, నితేశ్ రాణా వాదనలు వినిపించారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జిషీట్‌లో, అడిషన్ చార్జిషీట్లలో నిందితురాలిగా కవిత పేరు లేదని కోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత తనకు ఇచ్చిన సమన్లకు స్పందించి విచారణకు సహకరించినప్పటికీ అరెస్టు చేశారని వివరించారు.
Read Also: కేజ్రీవాల్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది?
ఒక మహిళ విషయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పడు బెయిల్, మధ్యంతర బెయిల్ అంశంలో ఈడీ టెక్నికల్ ఇష్యూలు చెప్పడం విడ్డూరంగా ఉందని సింఘ్వీ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో 9 స్టేట్‌మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్‌మెంట్ మరో విధంగా ఉందని కోర్టుకు నివేదించారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం(MLC Kavitha Bail Petition)పై మరో రోజు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఇరు పక్షాలకూ సూచిస్తూ.. విచారణను ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు.
READ LATEST TELUGU NEWS: నా భర్త నిజమైన దేశభక్తుడు: కేజ్రీవాల్ సతీమణి సునీత