MPTC Mahender Reddy: భువనగిరి ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని యాదాద్రి జిల్లా రామన్నపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, వెల్లంకి గ్రామ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో లక్ష ఓట్ల మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని మహేందర్ పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ ALSO : కేసీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. అందుకు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, అందరం కలిసికట్టుగా పని చేస్తామని టీఎంఆర్ (MPTC Mahender Reddy) చెప్పారు.
READ LATEST TELUGU NEWS : ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ఆవిష్కరించిన షర్మిల