పుట్టిన కొన్నాళ్లకే పోలియో బారిన పడ్డాడు. అయినా ఏ మాత్రం క్రుంగిపోకుండా జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నాడు. తల్లిదండ్రుల సంరక్షణలో చదువుల్లో ముందడగేశాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా భీష్మించాడు. ఉన్నత చదువుల్లో నిరూపించుకుంటూనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమ కెరటమయ్యాడు. రాజకీయాల్లోనూ రాణించాడు. తనలాంటి అంగవైకల్యం గలవారికి రాజకీయాల్లో సమాన అవకాశాలు దక్కేలా చూడాలని పరిశోధన మొదలుపెట్టాడు. ఆ పరిశోధన విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు యాదాద్రి జిల్లాకు చెందిన ఎర్రోళ్ల(నకరకంటి) అశోక్ (Doctorate Errolla Ashok).
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన వ్యక్తి అశోక్ (Doctorate Errolla Ashok). ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం పొలిటికల్ పార్టిసిపేషన్ పర్సన్స్ విత్ డిజబులిటీ ఏ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్(రాజకీయాల్లో దివ్యాంగుల భాగస్వామ్యం-తెలంగాణలో అధ్యయనం) అనే అంశంపై ఓయూ రాజనీతి శాస్త్రం విశ్రాంత ప్రొఫెసర్ జాడి ముసలయ్య(హెచ్ఓడీ) పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.
రాజకీయ హక్కుల కోసం అనే అంశంతో తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. అందుకు అత్యున్నత పీహెచ్‌డీ డిగ్రీని ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ పరిశోధన దేశ, రాష్ట్ర రాజకీయాల్లో దివ్యాంగులకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో రాజకీయ ప్రాధాన్యత అంతగా లేదు. ఈ అంశం వారికి చట్టసభల్లో కచ్చితమైన అవకాశాలు కల్పించాలని తెలియపరుస్తూ వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు ఎంతో ఉపయోగపడుతుందని అశోక్ (Doctorate Errolla Ashok) తెలిపారు.
కుటుంబం నేపథ్యం..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని ఎర్రోళ్ల(నకరకంటి) మల్లయ్య నరసమ్మలకు అశోక్ జన్మించారు. ఒక ఆడబిడ్డ, అయిదుగురు అన్నదమ్ముల్లో చివరి వ్యక్తి (Doctorate Errolla Ashok).
సతీమణి శ్రావణి, కూతురు హెశుశ్రీ, కుమారుడు ఓపీర్ కరుణ కుమార్‌లు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అశోక్ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
తన సోదరి వివిధ ప్రాంతాలకు వలస కూలీలుగా పనులకు వెళ్లేవారు. ఆ సందర్భంలో ప్రాథమిక విద్యాభ్యాసంలో ఆటంకం ఏర్పడినా చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు.
ప్రపంచంలోనే ఉన్నత విద్యావంతులు, మేధావుల్లో ఒకరైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌ని అశోక్ స్పూర్తిగా తీసుకున్నారు. తన మేనమామ కాసర్ల లింగయ్య, భువనగిరి మాజీ జడ్పీటీసీ సందెల సుధాకర్ ప్రోత్సాహంతో సొంతూరు వెల్లంకిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తిచేశారు.
అనంతరం చేనేత వృత్తిని కొనసాగిస్తూనే రామన్నపేటలో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పూర్తి చేసి.. 2009లో ఓయూలో పీజీ పూర్తి చేశారు. 2011లో ఓయూలో ఎంఎస్ డబ్ల్యూ, 2012లో బీఈడీ పూర్తి చేశారు.
2017లో పీహెచ్‌డీలో చేరారు. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనే రాజకీయాలకు ఆకర్షితుడై విద్యార్థి నాయకుడిగా మొదలై విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ఎర్రోళ్ల అశోక్ (Doctorate Errolla Ashok) పోరాటాలు చేశారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు.
ఈ క్రమంలో వికలాంగుల హక్కుల కోసం అశోక్ పని చేశారు. ఉన్నత విద్యకై ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఓయూ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీలక పాత్ర పోషించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేశారు. అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
తన కాలు రెండుసార్లు విరిగినా మొక్కవోని ధైర్యంతో పోరాడారు. ఈక్రమంలో తనపై అనేక కేసులు బనాయించి పలుమార్లు బైండోవర్లుగా నిర్బంధించినా తన పోరాటం మాత్రం అశోక్ ఆపలేదు. తెలంగాణ కొరకై ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు.
వారి సహకారంతో..
ఉన్నత విద్యలో ఆర్థికంగా, మాటపూర్వకంగా, వివిధ సహాయ సహకారాలు అందించిన వెల్లంకి గ్రామం మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, రావిటి మల్లికార్జున్, మాజీ సర్పంచ్ కూరెళ్ల నరసింహాచారి, ఎడ్ల నరేందర్ రెడ్డి, ఈడెం శ్రీనివాస్, తూడి మురళీధర్, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, తాళ్లపల్లి మధుసూదన్ రెడ్డి, మడూరి ప్రభాకర్ రావుకు, స్నేహితులకు(Doctorate Errolla Ashok) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశ్రీ కూరెళ్ల అభినందన..
కుటుంబ సభ్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, ప్రొఫెసర్ ఎం.బ్రహ్మానందం, రంజిత్ ఓపిర్, జేమ్స్ జగదీష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ఎర్రోళ్ల అశోక్‌కు అభినందనలు తెలియజేశారు.
READ LATEST TELUG NEWS : స్వామికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు