తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)(MAA) అధ్యక్షుడు మంచువిష్ణు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా చేయాలని ‘మా’ నిర్ణయించిందని వెల్లడించారు.
వచ్చే జులై నెలలో మలేషియా వేదికగా ఈ మహా కార్యక్రమం నిర్వహిస్తామని మంచు విష్ణు తెలిపారు. ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి వేడుకల తేదీని ప్రకటిస్తామన్నారు. జులైలో మూడు రోజుల పాటు షూటింగ్స్‌కు సెలవులు ఇవ్వాలని ఇప్పటికే నిర్మాతల మండలిని కోరినట్లు వెల్లడించారు.
సెలవుల అంశంపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని మంచు విష్ణు పేర్కొన్నారు. దేశంలోని 5 అసోసియేషన్లతో ‘మా‘ (MAA)ఒప్పందం చేసుకుందని ఈ సందర్భంగా వెల్లడించారు. 90 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటిచెప్పేందుకే ఈ వేడుకలను వైభవంగా నిర్వహించ బోతున్నామని ఆయన ప్రకటించారు.
READ LATEST TELUGU NEWS: రూ.1.90 కోట్లా? చిరు వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అవ్వొచ్చు