Sunday, July 13, 2025
HomeSeat in stanford university: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విశాఖ యువకుడికి సీటు

Seat in stanford university: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విశాఖ యువకుడికి సీటు

Seat in stanford university: విశాఖపట్నంకు చెందిన యువకుడికి అద్భుతమైన అవకాశం దక్కింది. ఒబిలిశెట్టి శ్రీరామ్‌ వరుణ్‌ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(MBA)లో రూ.కోటి స్కాలర్‌షిప్‌తో సీటు లభించింది.

అమెరికాలోని ఐవీవై లీగ్‌ యూనివర్సిటీలో శ్రీరామ్ వరుణ్‌కు కూడా సీటు లభించిందని.. అయినప్పటికీ స్టాన్‌ఫోర్డు వర్సిటీ(Stanford University)లో చేరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దేశంలో అతికొద్ది మందికి మాత్రమే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందని, రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: ఓయూ ఉద్యమ నేత అశోక్‌కు డాక్టరేట్

శ్రీరామ్ తండ్రి డాక్టర్‌ వి.రాజ్‌కమల్‌ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగ ప్రొఫెసరుగా పనిచేస్తుండగా.. తల్లి డాక్టర్‌ డాక్టర్‌ సౌదామిని విశాఖలో గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు.

శ్రీరామ్ వరుణ్‌(SriRam Varun) ఇంటర్మీడియట్‌లో 983 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్సుడ్‌లో జాతీయ స్థాయిలో 178వ ర్యాంకు సాధించి కాన్పూర్‌ ఐఐటీలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేశారు.

దక్షిణ కొరియా సామ్‌సంగ్‌ సంస్థలో రీసెర్చ్‌ ఇంజినీరుగా కూడా శ్రీరామ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం వార్షిక వేతనం కింద రూ.1.25కోట్లు పొందుతున్నారు. ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు(Seat in stanford university)ను స్కాలర్‌షిప్‌తో దక్కించుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

READ LATEST TELUGU NEWS:  స్వామికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు  

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS