2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి?
విజయ దుందుభిని మోహించే గెలుపు గుర్రాలు ఎన్ని?
అధికారంలోకి రావడానికి ఆయా పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజల మనసులను గెలుచుకున్న పథకాలు ఏంటి ? ఇప్పుడు తెలుసుకుందాం:
గతంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను పార్టీ నాయకులకి కార్యకర్తలకి సిద్ధమని స్లోగన్ తో, మరియు కూటమి కూడా సంసిద్ధమని స్లోగన్తో హోరా హోరి ప్రచారాలు నిర్వహించాయి. మే 13న జరిగినటువంటి పోలింగ్లో ఆంధ్రప్రదేశ్లో మునిపెన్నడూ లేనివిధంగా 81% పోలింగ్ నమోదు తో ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలిపారు జూన్ 4 వరకు వేచి చూడాల్సినటువంటి అంశం. ఇవాల్టితో దేశం మొత్తం ఎన్నికలు ముగియ ఉన్నాయి. అయితే కొన్ని సర్వే సంస్థలు గెలుపు ఎవరిది అనేది అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రాంతాలవారీగా చూసుకున్నట్లయితే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్రాలో ప్రజలు ఎవరికి మొగ్గుచూపుతున్నాయో చూద్దాం:
ముందుగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఎక్కువ వరకు వైసిపి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని ఎన్నికల సర్వేల సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా ప్రజలు వైసిపి వైపే మగ్గుచూపుతున్నప్పటికీని కూటమి కూడా గట్టిగానే పోటీ ఇస్తుంది అని చెప్పటం గమనార్ధం. ఇకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో టీడీపీ పై చేయి అయ్యే అవకాశం ఉందని ఎన్నికల సర్వేల సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
పార్టీల గెలుపుకి కారణమయ్యేటువంటి అంశాలు చూద్దాం:
వైయస్సార్ పార్టీ గెలుపుకి ముఖ్య కారణం అయ్యేటువంటి ఓటు బ్యాంకు ను పరిశీలించినట్లయితే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు వైసిపి వైపే అని అభిప్రాయపడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం కూడా ఒకంత జగన్ వైపే అని అంచనా వేస్తున్నారు. వైయస్సార్ పార్టీ ఇచ్చినటువంటి నవరత్నాలు ఓటర్లను బాగా ఆకర్షించవచ్చు అని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రభావము బాగా పనిచేస్తుంది, కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా పవన్ వైఫై ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం.
చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర అభివృద్ధి ఆయనకున్న అనుభవం గవర్నమెంట్ ఉద్యోగులను మరియు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినటువంటి ఉద్యోగుల ఓట్లు అదనపు బలం అవ్వచ్చని సర్వే సంస్థలు అంచనాల వేస్తున్నాయి… ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రాబోయేటువంటి పార్టీ ఏదైనా కొద్దిపాటి ఓటు పర్సంటేజ్ తో గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ సమాచారం.