Naxal Killed In Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య 8 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులను మరణించినట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. బీజాపుర్ జిల్లాలోని లెండ్రా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు.
డీఆర్‌జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండ్ యూనిట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
Read Also: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 74 మంది మృతి
అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు(Encounter In Chhattisgarh) చేపట్టాయి.
కాల్పులు ముగిసిన అనంతరం ఘటనాస్థలంలో ఎనిమిది మృతదేహాల(Maoists Killed)ను భద్రతా సిబ్బంది గుర్తించారు. లైట్ మెషిన్ గన్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్(Naxal Killed In Chhattisgarh Encounter) కొనసాగుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
READ LATEST TELUGU NEWS: వారికి నేను భయపడను: ప్రధాని నరేంద్ర మోడీ