Thursday, April 24, 2025
HomeTillu Square Review: టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

Tillu Square Review: టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

టాలీవుడ్ యూత్ ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం “డీజే టిల్లు”(DJ Tillu) కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్ లా వచ్చిన అవైటెడ్ చిత్రమే “టిల్లు స్క్వేర్”(Tillu Square Review).

దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో రివ్యూలో(Tillu Square Review) చూద్దాం..

డీజే టిల్లు(DJ Tillu) సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దీని(Tillu Square)పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంటర్టైనింగ్ పరంగా టిల్లు స్క్వేర్ వాటిని అందుకుంటుంది అని చెప్పవచ్చు.

సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్‌తో సినిమా(Tillu Square) సాగుతుంది. ఇక స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా షైన్ అయ్యాడు.

తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ హిలేరియెస్‌గా పండించాడు అని చెప్పాలి. కొన్ని సీన్స్‌లో మంచి హ్యాండ్సమ్ లుక్స్‌తో మంచి నటనతో తాను ఈ సినిమాలో ఎంటర్టైన్ చేశాడు.

ఇక రాధికకి అప్డేటెడ్ వెర్షనా లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్‌లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామర్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది.

అలాగే హీరో హీరోయిన్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. కామెడీ సీన్స్‌తో ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ట్రీట్ ఇస్తారు. ఇక వీటితో పాటుగా సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు.

ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్‌కి న్యాయం చేశారు. ఇంకా నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

ఈ (Tillu Square)సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. అలాగే టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ భీమ్స్ నేపథ్య గీతంలు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే తను ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. తనతో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. నరేషన్ ని మల్లిక్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం బాగుంది. స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్ గానే ఉన్నాయి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం తాను పుష్కలంగా అందించాడు.

ఇక మొత్తంగా చూసినట్టు అయితే డీజే టిల్లుకి సీక్వెల్‌గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిజప్పాయింట్ చెయ్యదు అని చెప్పాలి.

సిద్ధూ, అనుపమలు మెయిన్ లీడ్‌లో అదరగొట్టేశారు. మంచి కామెడీ డీసెంట్ నరేషన్ సినిమాలో ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి ఇవి పక్కన పెడితే మరోసారి టిల్లు గాడు మంచి క్రేజీ రైడ్‌తో కూడిన ఎంటర్టైన్మెంట్‌ని థియేటర్స్‌లో అందిస్తాడు.

READ LATEST TELUGU NEWS:  ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS