Know Your Candidate: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ కేవైసీ (Know Your Candidate) పేరుతో ఓ కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్‌తో పాటు వారిపై ఉన్న వివిధ కేసులు, నేర చరిత్ర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయన ఈ యాప్ ను విడుదల చేశారు. ‘నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ)(Know Your Candidate) ’ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు ఐఓఎస్ వినియోగదారులకూ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
ప్రతీ ఓటరుకు తన నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై ఓటర్లకు స్పష్టత వస్తుందని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వీలు కలుగుతుందని వివరించారు.
READ LATEST TELUGU NEWS: పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా