Saturday, June 21, 2025
HomeOSCAR AWARDS 2024: ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన RRR

OSCAR AWARDS 2024: ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన RRR

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ఆస్కార్స్ వేదిక(OSCAR AWARDS 2024)పై మరోసారి మెరిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టేజీపై ఆర్ఆర్ఆర్ (RRR) సీన్స్ మళ్లీ మెరిశాయి.

నాటు నాటు స్టెప్పులేస్తుంటే..

గత ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌(RRR) లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. అయితే అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో సోమవారం ఆస్కార్ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును ప్రకటించే సమయంలో నాటు నాటు సాంగ్‌ను బ్యాగ్రౌండ్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీడియోలో స్టెప్పులేస్తుంటే.. అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విన్నర్స్‌ని ప్రకటించారు. బార్బీ చిత్రంలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే సాంగ్‌కు ఈసారి ఆస్కార్ వచ్చింది.

క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కూడా..

ప్రపంచంలోనే గొప్ప స్టంట్ మాస్టర్స్‌ అందరికీ సలాం కొడుతూ ఆస్కార్స్ అకాడమీ పలుచిత్రల్లోని యాక్షన్ సీన్స్ ప్రదర్శించింది. అందులో మేటి చిత్రాల సరసన రాజమౌళి కళాఖండం చేరింది. ఆర్ఆర్ఆర్(RRR) మూవీలోని క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌ను స్టేజీపై ఉన్న స్ర్కీన్ మీద ఈ సందర్భంగా ప్లే చేశారు.

క్లైమాక్స్ ఫైట్‌లో ఎన్టీఆర్ భుజాలపైకి ఎక్కి రామ్ చరణ్ టవర్‌నుంచి దూకే సీన్.. ఆస్కార్ స్టంట్స్ వీడియోలో చోటు దక్కించుకుంది. ఇది చూసి ఫ్యాన్స్ మస్త్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఆస్కార్ వేదిక(OSCAR AWARDS 2024)పై మరోసారి ఆర్ఆర్ఆర్ హవా అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో అసలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఆర్ఆర్ఆర్ ఫీవర్ తగ్గలేదని అభిమానులు నెట్టింట్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ జోష్ కనిపించింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు(Naatu Naatu) సాంగ్ లైవ్ ప్రదర్శనతో రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ లైవ్ ఫెర్మార్మెన్స్ ప్రజెంటర్‌గా పాట గురించి గొప్పగా మాట్లాడింది. ఇంకా ప్రతీ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సందడి చేసింది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్స్‌లో అవార్డులు గెలిచి అదరగొట్టింది.

READ LATEST TELUGU NEWS : గామీ అవార్డుల్లో సత్తా చాటిన భారత్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS