VIjay Devarakonda Relationship Status: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి ఏ కొత్త సినిమా వచ్చినా ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్ ముఖ్యంగా అడిగే ప్రశ్న మీ పెళ్లి ఎప్పుడు? ఎవరితో అయినా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని.
ఇప్పుడు విజయ్ (VIjay Devarakonda) నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై విజయ్ స్పందిస్తూ.. రిలేషన్‌షిప్‌లో ఉన్నాను కానీ తన తల్లిదండ్రులు తమ్ముడు ఆనంద్, ఫ్యాన్స్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మాట దాటేసారు.
చాలా కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిలేషన్‌షిప్(VIjay Devarakonda Relationship Status)లో ఉన్నారని.. రష్మిక విజయ్ ఇంట్లో ఉంటోందన్న టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు కనిపించింది కూడా.
Read Also: రూ.1.90 కోట్లా? చిరు వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అవ్వొచ్చు
చాలా సార్లు రష్మిక పోస్ట్ చేసే ఫోటోలు విజయ్ పోస్ట్ చేసే ఫోటోల్లో ఒకే ఇల్లు కనిపిస్తోంది. వెకేషన్లకు కూడా కలిసే వెళ్తున్నారు. ఈ 2024లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.

దాంతో విజయ్, రష్మికలు కూడా తమ ప్రేమ విషయాన్ని(Rashmika Relationship) ఇప్పటికైనా బయటపెడతారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

