టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ కొత్తేమీ కావు… అయితే తాజాగా హీరోలు గురించి బెంగళూరులో ఓ వాగ్వాదం (Fan War) జరిగింది. కొందరు యువకులు ఓ అబ్బాయిని పట్టుకుని చావబాదారు. అతన్ని ఏకంగా చంపేసేంత పనిచేశారు.
మ్యాటర్ ఏంటా అని చూస్తే.. వారిలో ఒకరు అల్లు అర్జున్ అభిమాని కాగా.. మరొకరు ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్ అయిన ఓ యువకుడు అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమాని మర్యాదగా డిలీట్ చేసి సారీ చెప్పు అన్నాడట.
ఇందుకు ప్రభాస్ అభిమాని ఒప్పుకోలేదు. దాంతో అడ్రెస్ పెట్టురా చూసుకుందాం అని సవాల్ విసురుకున్నారు. ప్రభాస్ అభిమాని అడ్రస్ పెట్టడంతో అల్లు అర్జున్ అభిమాని మరికొందరు అబ్బాయిలతో కలిసి నడిరోడ్డుపై (Fan War) కొట్టుకున్నారు.
ప్రభాస్ అభిమానిని ఒక్కడిని చేసి చావబాదారు. మర్యాదగా జై అల్లు అర్జున్ అంటావా అనవా అంటూ కన్నడలో కేకలు వేసారు. పక్కనే ఉన్న మరో అబ్బాయి వాడు చచ్చేలా ఉన్నాడని భయపడి ఇంక చాలు ఆపరా అంటూ కన్నడ భాషలో అరిచాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే వీడియో తీసి బెంగళూరు పోలీసులకు ట్విటర్‌లో ట్యాగ్ చేసారు. ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసారు.
READ LATEST TELUGU NEWS: ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన RRR