Phone Tapping Case In Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు ఈనెల 6 వరకు రిమాండ్ విధించింది.
మంగళవారం నాటికి ఇద్దరి కస్టడీ ముగియడంతో వారిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 6 వరకు ఇద్దరు ఏఎస్పీలకు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఈ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
మొదటి సారి రిటైర్డ్ ఐజీ పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. రిటైర్డ్ ఐజీతో పాటు తిరుపతన్న, భుజంగ రావు, రాదాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణు గోపాల్ రావు కలిసి ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case In Telangana) కుట్ర పన్నారని పేర్కొన్నారు.
పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్‌రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
READ LATEST TELUGU NEWS: రాష్ట్రంలో రాజుకుంటున్న పొలిటికల్ హీట్