Thursday, April 24, 2025
HomeBaltimore Bridge Collapse In USA: బాల్టిమోర్ వంతెన ప్రమాదం వల్ల అమెరికాలో ఆర్థిక విపత్తు

Baltimore Bridge Collapse In USA: బాల్టిమోర్ వంతెన ప్రమాదం వల్ల అమెరికాలో ఆర్థిక విపత్తు

Baltimore Bridge Collapse In USA: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో గత మంగళవారం (మార్చి 26న) జరిగిన ఘోర నౌక ప్రమాదంలో ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెన కుప్పకూలిపోయింది.

ఈ వంతెన కూలిపోవడంతో స్థానిక పోర్టులో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినట్టు మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ వెల్లడించారు.

ఈ పరిస్థితి మేరీల్యాండ్, బాల్టిమోర్ ప్రాంతాలకే పరిమితం కాదని.. అమెరికా ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాద ఘటనను ఆయన ‘జాతీయ ఆర్థిక విపత్తు'(National Economic Catastrophe)గా పేర్కొన్నారు.

అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో బాల్టిమోర్ ప్రధానమైందని.. వెస్ మూర్ వెల్లడించారు. గతేడాది ఈ ఓడరేవు నుంచి 11 లక్షల కంటైనర్లు వెళ్లాయన్నారు.

ట్రక్కులు, కార్లు, వ్యవసాయ పరికరాల సరఫరాకు అమెరికాలో ఇదే అతిపెద్ద పోర్టు అని తెలిపారు.

ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జి(Francis Scott Key Bridge) కూలిపోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని వెస్ మూర్ ఆందోళన చెందారు.

ఒహియోలో ఆటోమోబైల్ డీలర్లు, కెంటకీలో రైతులు, టెనెస్సీలో రెస్టారెంట్లపైనా ఈ ప్రమాద ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

Read Also: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 74 మంది మృతి

బాల్టిమోర్ నౌకాశ్రయం అమెరికా ఆర్థికాభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తుందని గుర్తుచేశారు.. వెస్ మూర్.

అందుకే రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఘటనపై జాతీయ రవాణభద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు.

అసలేం జరిగింది?

మార్చి 25 అర్ధరాత్రి దాటిన తర్వాత సింగపూర్ జెండాతో ఉన్న ఓ భారీ నౌక శ్రీలంక రాజధాని కొలొంబోకు బయల్దేరింది.

మార్గమధ్యంలో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెన పిల్లర్‌ను షిప్ బలంగా ఢీకొట్టింది.

ఈ నౌకలో భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన వారు.. వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.

దీంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. దీని వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడగలిగారు.

లేకుంటే వంతెన కూలిపోయిన తర్వాత కూడా చీకట్లో వాహనాలు దూసుకొచ్చి నీటిలో పడిపోయేవి.

Read Also: రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్.. 10 నిమిషాల్లో రావాల్సిందే 

కాగా ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అటు ప్రమాదాన్ని పసిగట్టి అలర్ట్ చేసిన భారత సిబ్బందిని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అభినందించారు.

అయితే.. బ్రిడ్జి శకలాలను తొలగించేందుకు అమెరికా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 1000 టన్నుల బరువును ఎత్తే క్రేన్ల సహాయంతో శిథిలాలను బయటకు తీస్తున్నారు.

అయితే బ్రిడ్జిని ఢీకొట్టిన షిప్‌పై 3 నుంచి 4 వేల టన్నుల బరువు గల శకలాలు ఉన్నాయట. దీంతో అది అక్కడే చిక్కుకుపోయింది.

సుమారు ఈఫిల్ టవర్ అంత పొడవైన(984 అడుగులు) ఈ షిప్‌ను తరలించడం అధికారులకు ఓ ఛాలెంజ్ లాంటిదే.

ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెన 1977 నుంచి సుమారు నాలుగున్నర దశాబ్ధాలుగా సేవలందిస్తోంది.

అలాంటి ప్రాచీన వంతెన(Baltimore Bridge Collapse In USA) కూలిపోవడంతో దీన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదంపై అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ.. లోతైన విచారణ చేపట్టారు.

READ LATEST TELUGU NEWS: అడుగు దూరంలో వరల్డ్‌ వార్‌-3.. పుతిన్‌ హెచ్చరిక

 

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS