Tuesday, April 22, 2025
HomeIndian 2 Songs: ఒక్క పాట రూ.30 కోట్లా?

Indian 2 Songs: ఒక్క పాట రూ.30 కోట్లా?

ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ ‘ఇండియ‌న్ 2′ సినిమాలో న‌టిస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో’ ఇండియ‌న్ 2′ ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది. శంకర్ అంటేనే భారీ సినిమాలు, సాంగ్స్(Indian 2 Songs) ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతాయి.

జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి భారీ సినిమాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ సినిమాలు ఎంత భారీస్థాయిలో రూపుదిద్దుకుంటాయో.. ఆ సినిమాలోని పాటలు కూడా అంతేభారీ స్థాయిలో తెరకెక్కుతుంటాయి.

పాటలకు ప్రాధాన్యం ఇచ్చే డైరెక్టర్ శంకర్.. తాజాగా ఓ పాట(Indian 2 Songs) కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం ‘ఇండియన్ 2’లో ఒక పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించనున్నట్లు సమాచారం.

రూ.30 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ పాట(Indian 2 Songs)ను రూపొందించాలని ప్లాన్ చేసారట. ఇది యాక్షన్ అడ్వెంచర్‌కు హైలైట్‌గా నిలుస్తుందని, విజువల్ గా ఆకట్టుకునే పాటలకు పెట్టింది పేరు దర్శకుడు శంకర్ అని, ఈసారి కమల్ హాసన్ కోసం భారీ ఖర్చు పెడుతున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి.

కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు’ సీక్వెల్ చాలా కాలంగా నిర్మాణ దశలో ఉంది. ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ అని రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విభజించారు. టాకీ పోర్షన్స్ పూర్తి చేసి ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు.

ఇటీవల ‘ఇండియన్ 2’లో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్‌తో ఓ పాట(Indian 2 Songs)ను పూర్తి చేసిన చిత్రబృందం కమల్ హాసన్‌తో ఓ గ్రాండ్ గాలా సాంగ్ ప్లాన్ చేస్తోంది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట మ్యూజిక్ చార్టులను తిరగరాయడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. అనిరుధ్‌తో కలిసి కమల్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’లోని ‘పాతాలే పాతాలే’ పాట కోలీవుడ్‌లో సెన్సేషనల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే, క‌మ‌ల్ హాస‌న్ కు ‘విక్రమ్’ సినిమా అత్యంత భారీ హిట్‌ ఇచ్చింది. త‌మిళ‌నాడులోనే ఎక్కువ మంది ప్రేక్ష‌కులు చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రూ. 450 కోట్లు వ‌సూళ్లు చేసి త‌మిళ సినిమా రంగంలో మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక సీనియర్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో’ ఇండియ‌న్ 2′ ఓ రేంజ్‌లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరో క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబోలో ‘భార‌తీయుడు’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియ‌న్ 2’ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ‘ఇండియ‌న్ 2’ సినిమా షూటింగ్‌లో చాలా బిజిబిజీగా గడిపేస్తున్నారు. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ రూ. 150 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌.

ఇక అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న హీరోల లిస్టులో ప్ర‌భాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ప్ర‌భాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా త‌రువాత రూ. 125 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌.

అయితే  ‘ఇండియ‌న్ 2’ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ‘విక్ర‌మ్’ సినిమా త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్ప‌డింద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇక ‘ఇండియ‌న్ 2’ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించ‌నుందో చూడాలి మరి.

READ LATEST TELUGU NEWS: ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన RRR

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS